ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా కర్ఫ్యూ.. బోసిపోయిన రోడ్లు

ABN, First Publish Date - 2021-05-17T05:27:38+05:30

పట్టణంలో ఆదివారం నిర్వహించిన సంపూర్ణ కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేష న్న, పోలీసులు జరిమానా విధించారు.

ఉరవకొండలో వాహన, జన సంచారం లేకపోవడంతో నిర్మానుష్యంగా మారిన ప్రధాన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు టౌన, మే 16: పట్టణంలో ఆదివారం నిర్వహించిన సంపూర్ణ కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేష న్న, పోలీసులు జరిమానా విధించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో ప్రజలు అత్యవసరముంటే తప్పా బయటకు రావద్దన్నారు. 


ఉరవకొండ : పట్టణంలో ఆదివారం కర్ఫ్యూను పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. వ్యాపార సముదాయాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జాతీయ రహదారి బోసిపోయింది. అనవసరంగా రోడ్లమీద తిరుగుతున్న వాహనాలకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఎస్సై రమే్‌షరెడ్డి సూచించారు. 


బొమ్మనహాళ్‌ : మండలంలో ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగింది. బొమ్మనహాళ్‌, ఉద్దేహాళ్‌ గ్రామాల్లో వ్యాపార స ముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మటన, చికెన సెంటర్ల కు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతి ఇచ్చారు.  నేమకల్లు, శ్రీధరఘట్ట గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 


విడపనకల్లు : మండలంలో ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూతో రోడ్లు ఉదయం 9 గంటలకే నిర్మానుష్యంగా కనిపించాయి. ఉదయమే రోడ్ల పైకి వచ్చిన పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలని సూ చించారు. మండల కేంద్రంలో ఎక్కడా జన సంచారం లేకుండా చేశా రు. పల్లెల్లోను తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు. అనవసరంగా రోడ్ల మీదకు రాకూడదని సూచించారు. స్థానిక బస్టాండ్‌ ప్రాంతం  బోసి పోయింది. ఎస్‌ఐ గోపి కర్ఫ్యూను పర్యవేక్షించారు.


పామిడి : పట్టణంలో నిర్వహించిన సంపూర్ణ కర్ఫ్యూ ఆదివారం వి జయవంతమైంది. సీఐ శ్యామరావు, ఎస్‌ఐ గంగాధర్‌ సిబ్బందితో సం పూర్ణ కర్ఫ్యూకు తగిన చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల లో తప్పా ప్రజలను బయటకు రానివ్వకుండా ఆంక్షలు విధించారు. వైనషాపు వద్ద భౌతికదూరం పాటించేలా సూచించారు.   


తాడిపత్రి టౌన : పట్టణంలో ఆదివారం నిర్వహించిన 24 గంటల కర్ఫ్యూ ప్రశాంతంగా సాగింది. కరోనా ఉధృతి పెరుగుతుండడంతో  అన్ని షాపులను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. మెయినబజారు, సీబీ రోడ్డు, యల్లనూరు రోడ్డు, పుట్లూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో షాపులను మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కర్ఫ్యూను పోలీసులు పర్యవేక్షించారు. 


Updated Date - 2021-05-17T05:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising