ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథేచ్ఛగా మట్టి దోపిడీ

ABN, First Publish Date - 2021-10-18T06:12:50+05:30

ఉరవకొండ ప్రాంతంలో హంద్రీనీవా కాలు వ, కొండగుట్టల నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు.

ఉరవకొండలో హంద్రీనీవా కాలువ వద్ద మట్టితో చదును చేసిన వెంచర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నబోతున్న కాలువ గట్లు, కొండ గుట్టలు


ఉరవకొండ, అక్టోబరు 17: ఉరవకొండ ప్రాంతంలో హంద్రీనీవా కాలు వ, కొండగుట్టల నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ‘నవరత్నాలు పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమం చేపట్టడంతో వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణా లు చేపట్టారు. దీంతో గరుసు మట్టికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీం తో వ్యాపారులు వెంచర్లకు కాలువ మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. రోజు కు పదుల సంఖ్యలో కాలువల నుంచి, ప్రభుత్వానికి సంబంధించిన గుట్టల నుంచి మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఈ మట్టి వ్యాపారం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు న్నాయి. ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారు లు పెద్దఎత్తున వెంచర్లు, ప్లాట్లు వేశారు. కాలువ మట్టిని ఎలాంటి అనుమ తి లేకుండా తరలించుకు వెళుతున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యా రు.


రోజుకు వందల ట్రాక్టర్లతో మట్టిని తీసుకెళుతున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌ మట్టిని రూ.1,200లు దాకా అమ్ముకుంటున్నారు. మట్టి అక్రమ తరలింపు కొన్నేళ్లుగా జరుగుతున్నా అధికారుల ఉదాసీనత వల్లే తరలి వెళుతోంది. గ తంలో ఓ వెంచర్‌కు వ్యాపారి కాలువ మట్టిని తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. రాజకీయ నాయకుల నుంచి ఆ అధికారులకు ఫోనలు రావడంతో చేసేదేమిలేక వెనుతిరగాల్సి వచ్చింది. మండలంలోని వెలిగొండ గ్రా మంలో గత మూడు నెలల నుంచి గరుసు మట్టి, రాళ్లు అక్రమంగా రవా ణా కొనసాగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కొసమెరుపు. వెంచర్ల మధ్యలో ఈ మట్టిని వేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్ర భుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. 

Updated Date - 2021-10-18T06:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising