ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో ఏపీపీ మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:38:25+05:30

సీనియర్‌ న్యాయవాది, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బోయపాటి రాజేంద్రనాయుడు (60) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిఫీచర్స్‌, మే 16: సీనియర్‌ న్యాయవాది, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బోయపాటి రాజేంద్రనాయుడు (60) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కరోనా వ్యాధితో బాధపడుతూ అనం తపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయనకు నెగిటివ్‌ కూడా వచ్చింది. అనంతరం ఐదురోజులుగా ఇంటి పట్టునే ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి రావడంతో అనంతపురా నికి వైద్యం కోసం తీసుకె ళ్ళారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి కర్నూలుకు తరలించే సమయంలో మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. 30 సంవత్సరాలుగా కదిరి న్యాయవాదుల సంఘం సభ్యులుగా కదిరి ప్రాంతంలో అందరికి సుపరిచితుడు. ప్రస్తుతం అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కొనసాగుతున్నారు. ఓడీచెరువు మండలం చింతమా నుపల్లికి చెందిన నాయుడు వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా రాణించారు. ఆయన మృతి సహచర న్యాయవాదుల్లోనే కాక రాజకీయ ప్రముఖులను కూడా ఆవేదనకు గురి చేసింది. ఆయన భార్య పీఈటీగా పనిచేస్తోంది. మృతుడికి ఒక కుమార్తె ఉంది.  కరోనాను జయించి అనంతరం అనారోగ్యంతో మృతి చెందడం అందరిని కలచివేస్తోంది. అతని మృతికి న్యాయవాదుల సంఘం సభ్యులు నివాళులు అర్పించారు.

Updated Date - 2021-05-17T05:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising