ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంఘాల అభివృద్ధే లక్ష్యం: ఎస్‌బీఐ

ABN, First Publish Date - 2021-02-24T06:29:22+05:30

స్వయం ఉపాధి మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధిం చేలా చేయడమే తమ లక్ష్యమని స్టేట్‌ బ్యాంక్‌ అమరావతి జనరల్‌ మేనేజర్‌ ఖాద్రి గుండురావు, కర్నూలు రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

మహిళా సంఘాలకు మెగా చెక్‌ అందిస్తున్న జీఎం, ఆర్‌ఎం,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, ఫిబ్రవరి 23: స్వయం ఉపాధి మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధిం చేలా చేయడమే తమ లక్ష్యమని స్టేట్‌ బ్యాంక్‌ అమరావతి జనరల్‌ మేనేజర్‌ ఖాద్రి గుండురావు, కర్నూలు రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ అన్నారు. గోరంట్లలోని రంగమహాల్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌బీఐ ఆధ్వర్యం లో మంగళవారం ఏర్పాటు చేసిన మహా రుణ మేళా కార్యక్రమాన్ని వీరు ప్రారంభిం చారు. ఈ సమావేశానికి గోరంట్ల, పుట్టపర్తి, ఓడీసీ, చిలమత్తూరు, బుక్కపట్నం తదితర మండలాలకు చెందిన వందలాది మంది ఎస్‌హెచ్‌జీ మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణం పొంది చిరు వ్యాపారాలు చేస్తున్న మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీ లించారు. అనంతరం వారు మాట్లాడు తూ.. అనంతపురం జిల్లాలో 2,424 గ్రూపులు మాత్రమే రుణాలు తీసుకున్నాయని, ఇది కర్నూలు జిల్లాతో పోల్చితే చా లా తక్కువని అన్నారు. జిల్లాలో గోరంట్ల మండలంలో 473 గ్రూపులకు ఇప్పటివ రకు దాదాపు రూ.40 కోట్ల రుణం పంపిణీ చేశామన్నారు. గోరంట్లలోనే 20 సంఘాలకు రూ.2 కోట్ల రుణం మంజూరైందని బ్రాంచ్‌ మేనేజర్‌ మోసయ్య తెలిపారు. ఈ సందర్భంగా వివిధ మండలాల్లోని ఏడు బ్రాంచ్‌లకు సంబంధించి రూ.10 కోట్ల మెగా చెక్‌ను జీఎం, ఆర్‌ఎంలు అం దజేశారు.   ఈ కార్యక్రమంలో అనంతపురం చీఫ్‌ మేనేజర్‌ గురురాజు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఆశీర్వాదమ్మ, డీఆర్‌డీఏ ఏరియా కో-ఆర్డినేటర్‌ రమణప్ప, ఏపీఎం నారాయణ, బ్రాంచ్‌ మేనేజర్లు బ్రాహ్మణపల్లి శివనాగలింగాచారి, ఓడీసీ శ్రీనివాసరావు, బుక్కపట్నం ఆంథోనిబాబు, కల్లుమర్రి ఓబిరెడ్డి, గోరంట్ల మోసయ్య తది తరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T06:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising