ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుకను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు : సీఐ

ABN, First Publish Date - 2021-06-23T06:11:53+05:30

ఇసుకను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్య లు తప్పవని సీఐ శేఖర్‌ తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం సెబ్‌ సీఐ మారుతీరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు.

స్వాధీనం చేసుకున్న టిప్పర్ల వద్ద సీఐ శేఖర్‌, సెబ్‌ సీఐ మారుతిరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

27 టిప్పర్లకు రూ.9.72 లక్షల జరిమానా


ఉరవకొండ, జూన 22: ఇసుకను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్య లు తప్పవని సీఐ శేఖర్‌ తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం సెబ్‌ సీఐ మారుతీరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. అసిస్టెంట్‌ ఎనఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌, ఇనస్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్‌, నరసా నాయుడు ఆధ్వర్యంలో  సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు దాడులు చేశామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 27 టిప్పర్లను సీజ్‌ చేశామన్నారు. ఒక్కొక్క టిప్పర్‌కు రూ.36 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. టిప్పర్‌ యజమానులు ఇళ్లు కట్టుకునే వారి ఆ ధార్‌కార్డుల ద్వారా రీచల నుంచి ఇసుకను తీసుకు వచ్చి, వారికి డెలీవరీ ఇవ్వకుండా వేరే ఆధార్‌కార్డులు పెట్టి వారికి ఇష్టమొచ్చినట్లు ఎక్కువ డ బ్బులకు అమ్ముకుంటున్నారన్నారు. టిప్పర్‌ ఇసుకకు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు. టిప్పర్‌ యజమానులు అధిక ధరకు ఇసుక అమ్మితే వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising