ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలి బతుకులు ఛిద్రం..

ABN, First Publish Date - 2021-11-28T05:26:02+05:30

ఓ రోడ్డు ప్ర మాదం పేదల బతుకులను ఛిద్రం చేసింది. పొట్టచేతపట్టుకుని పనుల కోసం బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు

దంపతుల దుర్మరణం

మరో నలుగురు 

కుటుంబసభ్యులకు తీవ్రగాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

బాధితులు తెలంగాణ వాసులు


చెన్నేకొత్తపల్లి, నవంబరు 27: ఓ రోడ్డు ప్ర మాదం పేదల బతుకులను ఛిద్రం చేసింది. పొట్టచేతపట్టుకుని పనుల కోసం బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో  మృత్యువు కబళించిం ది. మండలంలోని ఎనఎ్‌సగేటు సమీపాన జా తీ య రహదారి ప్లైఓవర్‌పై శనివారం ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగు రు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల మేరకు... తెలంగా ణ రాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం నారేనాయక్‌తండాకు చెందిన ఇస్లావత స్వామినాయక్‌(38), శంకరమ్మ(35) ఎనిమిదేళ్లుగా అనంతపురంలో నివాసముంటూ కూలిపనులు చేసుకుని జీవిస్తుండేవారు. స్వామినాయక్‌ బావమరిది రాజు తో కలిసి జిల్లాలో ఎక్కడ పనులుంటే కొద్దిరోజులుపాటు అక్కడే ఉంటూ పనులు పూర్తి చేసుకుని, తిరిగి అనంతపురం చేరేవారు. స్వగ్రామం నుంచి కొంతమంది కూలీలను కూడా పిలుచుకుని పను లు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం హిందూపురంలో తారురోడ్లు నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. తమ  చిన్నబావమరిది పెళ్లికి స్వగ్రామమైన నారేనాయక్‌తండాకు వెళ్లి శుభకార్యం ముగించుకుని తెల్లవారుజామున 4 గంటల సమయంలో అక్కడి నుంచి కా రులో హిందూపురం బయల్దేరారు. ఎనఎ్‌స గేటు వద్దకు రాగానే ఐరన లోడుతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ ఉన్నఫలంగా బ్రేక్‌ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి లారీని బలం గా ఽఢీకొంది. ప్రమాదంలో దంపతులు శంకరమ్మ, ఇస్తావతస్వామినాయక్‌ అక్కడికిక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మృతుల కుమారులు 12 ఏళ్ల వెంకటేశ, మూడేళ్ల కుమారుడు అమృతతోపాటు అత్తమామలు సోమ్లానాయక్‌, సీతమ్మ, కారు నడుపుతున్న బావమరిది రాజు గాయపడ్డారు. సమాచారం అందుకున్న  పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కారులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో బయటకు తీసి, 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించినట్లు తెలిసింది. దంపతుల మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంఽఽధువులు ప్రమాద స్థలానికి చేరుకుని, దంపతుల మృతదేహాలను చూసి, బోరున విలపించారు. ప్రమాదంలో లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. పోలీసులు వాహనాలను స్టేషనకు తరలించి, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టినట్టు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. ఇస్లావత స్వామినాయక్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆరునెలలుగా హిందూపురంలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


స్వల్పగాయాలతో బయటపడ్డ మూడేళ్ల బాలుడు

ప్రమాదంలో ఇద్దరు మృతిచెంది.. నలుగురు తీవ్రంగా గాయపడగా.. మూడేళ్ల బాలుడు మా త్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్వామినాయక్‌ కుమారుడు అమృత స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు.

Updated Date - 2021-11-28T05:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising