ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2021-07-29T06:26:39+05:30

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ సెల్వరాజ్‌ అన్నారు. బుధవారం పరిగి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు.

పరి గి మండలంలో మామిడి చెట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, హిందూపురంలో అభివృద్ధి పనులపై కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ దిశానిర్ధేశం

హిందూపురం టౌన్‌ , జూలై 28: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ సెల్వరాజ్‌ అన్నారు. బుధవారం పరిగి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో ప్లానిటేషన్‌ వద్ద మొక్కలు నాటారు. అదేవిధంగా శ్రీరంగరాజులపల్లిలో రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీరంగరాజులపల్లివద్ద పొలంలో ఉపాధిహామీ పథకం కింద పండ్లతోటల పెంపకాన్ని పరిశీలించారు. మినీ గోకులాన్ని తనిఖీ చేశారు. పరిగి మండల కేంద్రంలో రైతు భరోసా గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని రెండో సచివాలయాన్ని తనిఖీచేసి ప్రజలకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఆగస్టు 15లోపు వందశాతం మొక్కలను నాటాలన్నారు. 


హౌసింగ్‌పై కలెక్టర్‌ దిశా నిర్ధేశం : నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిర్మితమవుతున్న ఇళ్లను సెప్టెంబర్‌ ఆఖరు నాటికి బేస్‌మెంట్‌ లెవెల్‌కు చేరాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ సెల్వరాజ్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో హౌసింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌తో సమీక్ష జరిపారు. హిందూపురం పట్టణ పరిధిలో 10వేలకు పైగా ఇళ్లు మంజూరు చేశారని త్వరితగతిన గ్రౌండింగ్‌ చేపట్టాలన్నారు. ఆప్షన్‌-1, 2, 3, కింద ప్రతి ఇంటినీ గ్రౌండింగ్‌ అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ నవీన్‌కుమార్‌, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ రామారావు, హౌసింగ్‌ ఈఈ చంద్రమౌళిరెడ్డి, తహసీల్దార్‌లు శ్రీనివాసులు, రంగనాయకులు, సౌజన్యలక్ష్మీ,  మునిసిపల్‌కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, హౌసింగ్‌ డీఈ శివకుమార్‌నాయక్‌, ఏపీడీ శివానందనాయక్‌,  వెటర్నరి డీడీ సుబ్బారావు, ఏడీ పెంచలయ్య, ఏఈ నారాయణరెడ్డి, సునీత,  ఆర్‌డబ్ల్యుఎస్‌, ట్రాన్స్‌కో అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-29T06:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising