ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నియంత్రణలో ఘోర వైఫల్యం

ABN, First Publish Date - 2021-06-17T06:15:33+05:30

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు.

హిందూపురంలో డీటీకి వినతిపత్రం అందిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జగన ప్రభుత్వంపై టీడీపీ నిరసన

-బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌

హిందూపురం టౌన, జూన 16: కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. కరోనా బాధితులను ఆదుకోవాలని బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అహుడా మాజీ చైర్మన అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వ్యాక్సిన పంపిణీ వేగవంతం చేయకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.10వేలుచొప్పున అందజేయాలన్నారు. ఆక్సిజనలేక మరణించిన కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలని కోరారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు అంత్యక్రియల కోసం తక్షణ సాయం కింద రూ.15వేలు అందజేయాలన్నారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీకి వర్తింపజేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలకే పరిమితమయ్యాయని సాయం చేయడంలో శ్రద్ధ కనబరచలేదని ఆరోపించారు. థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వ్యాక్సిన టీకాలు వేగవంతం చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం డీటీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు కొల్లకుంట అంజి, రమేష్‌, నెట్టప్ప, అమర్‌నాథ్‌, ప్రెస్‌ వెంకటేశ, హెచఎన రాము, ఆదినారాయణ, నవీన, హిదాయతుల్లా, వెంకటరమణ, దాదాపీర్‌, డైమెండ్‌బాబా, ఆంజనేయులు, రామాంజి, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-17T06:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising