‘పురం’లో 146 పాజిటీవ్ కేసులు
ABN, First Publish Date - 2021-05-02T04:47:18+05:30
హిందూపురంలో రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి.
హిందూపురం టౌన, మే 1: హిందూపురంలో రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. తాజాగా శనివారం కూడా 146 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదైనట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం వచ్చిన పాజిటీవ్ కేసులతో పట్టణంలోని మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించింది. ఇదిలా ఉండగా పరిగి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న సరళాదేవి (34) అనే ఉపాధ్యాయురాలు శనివారం మృతిచెందినట్లు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈమెకు వారం రోజుల క్రితం పాజిటీవ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ఈమెకు కోవిడ్‌తో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందన్నారు.
లేపాక్షి: కరోనా రెండోదశ మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. మండల వ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిబందనలు పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. మండల వ్యాప్తంగా కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పెనుకొండలో 92 పాజిటివ్ కేసులు
పెనుకొండ రూరల్: పెనుకొండ మండలం కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఓవైపు కొవిడ్‌పై అధికారులు అవగాహనకల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రాలేదు. తాజాగా శనివారం పెనుకొండ పట్టణంలో 85 పాజిటివ్ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో ఏడు కేసులు నమోదైనట్లు తెలిపారు.
Updated Date - 2021-05-02T04:47:18+05:30 IST