ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగాధార్‌కు రక్షణ కల్పిస్తాం: ఎస్పీ ఫకీరప్ప

ABN, First Publish Date - 2021-11-29T23:07:37+05:30

తనకు ప్రాణం భయం ఉందని పోలీసులకు ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తనకు ప్రాణం భయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కల్లూరు గంగాధర్‌రెడ్డికి రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. వాట్సప్ కాల్‌లో సీబీఐ అధికారులు సంప్రదించినట్లు కల్లూరు ఫిర్యాదు చేశారని ఎస్పీ పేర్కొన్నారు. సీబీఐ అధికారులు, మడకశిర సీఐ శ్రీరాములు తనపై ఒత్తిడి తెచ్చినట్లు గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారని  ఎస్పీ తెలిపారు. 




 జిల్లా ఎస్పీ ఫకీరప్పను కల్లూరు గంగాధర్‌రెడ్డి కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో సాక్ష్యం చెప్పాలంటూ తనను సీబీఐ అధికారులు వేధిస్తున్నారన్నారు. నెల రోజుల క్రితం సీబీఐ అధికారులు తమ ఇంటికి వచ్చారని కల్లూరు తెలిపారు. తాము చెప్పినట్లు వింటే రూ.10కోట్లు ఇస్తామని, వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సీబీఐ అధికారులు తనను ఏదో ఒక కేసులో ఇరికించేలా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న సీబీఐ విచారణకు హాజరయ్యానన్నారు. తాము చెప్పినట్లు వింటే రూ.20 లక్షలు ఇస్తామని సీబీఐ అధికారులు ఆఫర్ ఇచ్చారన్నారు. ప్రతిరోజు ఫోన్లు చేసి తనను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-29T23:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising