ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఉద్యమం @550

ABN, First Publish Date - 2021-06-20T08:51:05+05:30

రాజధానికి భూములిస్తే రైతుల భుక్తిని లాగేసుకోవాలని పాలకులు చూస్తున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 550వ రోజుకు చేరుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, జూన్‌ 19: రాజధానికి భూములిస్తే రైతుల భుక్తిని లాగేసుకోవాలని పాలకులు చూస్తున్నారని రాజధాని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 550వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు విడుదల చేస్తామని చెప్పి ఐదు రోజులవుతున్నా.. ఇంతవరకు జమ చేయలేదన్నారు. ఎప్పుడైతే మూడు రాజధానులని సీఎం అనారో.. ఆరోజునుంచి ఏఒక్క కంపెనీ, పరిశ్రమ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాలేదన్నారు. కాగా, ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని రైతులు సీఎం ఇల్లు ముట్టడిస్తారని సోషల్‌ మీడియాలో పోస్టులు రావటంతో రాజధాని గ్రామాల్లో శనివారం భారీగా పోలీసులు మోహరించారు. 


అమరావతిదే అంతిమ విజయం: లోకేశ్‌

రైతుల ఉద్యమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మద్దతు తెలిపారు. ‘‘550రోజులుగా సాగుతున్న మీ శాంతియుత పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. వెలకట్టలేని త్యాగాలు చేసిన మీవైపు ధర్మం ఉంది. ఆలస్యమైనా న్యాయపోరులో అమరావతిదే అంతిమ విజయం’’ అని ప్రకటించారు.

Updated Date - 2021-06-20T08:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising