ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమ్మ’కు కోత..ఆయాకు వాత

ABN, First Publish Date - 2021-07-08T11:01:13+05:30

పాఠశాల ఆయాలకు నెలకు రూ.వెయ్యి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదంతా రాష్ట్ర సర్కారుకే మేత.. ఆయాకు వేతనంగా రూ.వెయ్యి

6 వేలు ఇస్తామని నాడు ప్రకటన.. వెయ్యికోసి 14 వేలు అమ్మ చేతికి

అలా కోసిన మొత్తం రూ445 కోట్లు.. ఆ డబ్బులోంచే ఆయాకు జీతం 

ఆ లెక్కన ఇస్తే ఏడాదికి 54కోట్లే.. మిగిలిన 391 కోట్లు మళ్లింపేనా?


‘అమ్మ ఒడి’ కింద మొదట ఇస్తానన్నది ఒక్కో విద్యార్థికి రూ.15వేలు. చేతికొచ్చేసరికి రూ. వెయ్యి కోసేశారు. పాఠశాలలను పరిశుభ్రపరిచే ఆయాలకు... కోసిన ఆ మొత్తాల్లోంచి నెలకు రూ. 6వేలు ఇస్తామని అప్పుడు చెప్పి.. ఇప్పుడు రూ. వెయ్యి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇలా అటు అమ్మకు, ఇటు ఆయాకు కూడా వాత పెట్టారు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

 పాఠశాల ఆయాలకు నెలకు రూ.వెయ్యి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లో రోజూ పాఠశాలకు వచ్చి శుభ్రంచేయాలని, మరుగుదొడ్లు శుభ్రం చేయాలని నిర్దేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో సాధారణంగా తక్కువ మరుగుదొడ్లు ఉంటాయి. పిల్లలు తక్కువగానే ఉంటారు. కానీ ఉన్నత పాఠశాలల్లో 8-10 బాత్‌రూమ్‌లుంటాయి. పిల్లలూ ఎక్కువే ఉంటారు. రోజూ శుభ్రం చేయడమనేది శ్రమతో కూడినపనే. అలాంటి పని చేసేవారికి ఎంతిచ్చినా తక్కువే అని సీఎం జగన్‌ ఒకప్పుడు అనేవారు. ఈ మాటలను పక్కనపెట్టి...ఇప్పుడు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. నెలకు రూ.వెయ్యి అంటే రోజుకు కేవలం రూ.33. ఈ సొమ్ముతో ఎవరైనా ఇంత సేవ చేస్తారా? అదీ మరుగుదొడ్లు కడిగే పని చేస్తారా? అన్నది ప్రభుత్వం ఆలోచించాలని ఆయాలు కోరుతున్నారు. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పాఠశాలలు నడవలేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇది కూడా తప్పే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ వరకు పాఠశాలలు జరిగాయి. మిగిలిన నెలలు జరగకున్నా కనీసం కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అయినా ఇస్తానన్న 6వేల వేతనం ఇచ్చి ఉండాల్సిందంటున్నారు. కానీ మానవత్వం లేకుండా ఆయాల వేతనాన్ని ఇలా కోసేసి ఇమ్మనడం దారుణమంటున్నారు. అది కూడా ప్రభుత్వంపై భారం పడకుండా అమ్మఒడి నుంచి కోసేసిన మొత్తాన్నే ఇచ్చేందుకు వెసులుబాటు ఉండగా...ఇలా కోత కోసేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


చెల్లించేసిన చోట ఎలా?

రాష్ట్రంలో సుమారు 45వేల మంది ఆయాలున్నారు. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.4.5కోట్లు. ఏడాదికి రూ.54 కోట్లు. అంటే అమ్మఒడి కింద ఇచ్చే డబ్బులో రూ.445కోట్లు కోత కోసి...ఆయాలకు ఇస్తానన్న సొమ్ములో కోతపెట్టి 54కోట్లు ఇచ్చి సరిపెట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు ఇచ్చినా... 45వేల మందికి కలిపి అయ్యేది ఏడాదికి రూ.270కోట్లే. ఇలా చెల్లించినా ఇంకా రూ.180కోట్లు మిగులుతాయి. కానీ నెలకు రూ.వెయ్యి ఇస్తే...ఆయాలకు ఇవ్వాల్సిన రూ.391కోట్ల సొమ్మును ప్రభుత్వం మరోపనికి మళ్లించడమే అవుతుంది. మరోవైపు ఆయాలను నియమించుకోవాలని ప్రభుత్వమే పాఠశాలలను పురమాయించింది. వారికి రూ.6వేలు ఇమ్మంది. దీంతో అని కొన్నిచోట్ల ఆయాలకు ఇప్పటికే ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లు నెలకు రూ.6వేలు చొప్పున ఇచ్చేశారు. ఇప్పుడు ఆయాలకు రూ.వెయ్యి ఇస్తామంటే తమ సంగతేంటని పలువురు హెడ్మాస్టర్లు వాపోతున్నారు. 

Updated Date - 2021-07-08T11:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising