ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మా... అంతా మీ వాళ్లే!

ABN, First Publish Date - 2021-10-21T09:54:30+05:30

‘‘టీడీపీ కార్యాలయంపై మీ కార్యకర్తలతో మీరే దాడి చేయించుకున్నారేమో! దాడిని చంద్రబాబే పర్యవేక్షించాడని మా అనుమానం’’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ కార్యాలయంపై దాడిలో అవినాశ్‌ అనుచరగణం
  • స్వయంగా పాల్గొన్న కార్పొరేటర్‌ అరవ సత్యం
  • సహకార బ్యాంకు డైరెక్టర్‌ జోగ రాజు కూడా!
  • సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఆధారాలు
  • ‘మీరే దాడి చేయించుకున్నారు’ అన్న హోంమంత్రి


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ కార్యాలయంపై మీ కార్యకర్తలతో మీరే దాడి చేయించుకున్నారేమో! దాడిని చంద్రబాబే పర్యవేక్షించాడని మా అనుమానం’’... ఈ మాట అన్నది ఎవరో కా దు! స్వయానా... రాష్ట్ర హోంమంత్రి సుచరిత! అయితే... దాడి చేసింది వైసీపీ కార్యకర్తలేనని, విజయవాడకు చెందిన ఆ పార్టీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ అనుచరులు ఇందులో పాల్గొన్నారని స్పష్టంగా తేలిపోయింది. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డితోపాటు దేవినేని అవినాశ్‌ సారథ్యంలోనే దాడి జరిగినట్లు టీడీపీ ఇప్పటికే అనుమానిస్తోంది. దుండగులు లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడికి చెందిన వాహనంలోనే రావడం... అదే వాహనం తర్వాత వైసీపీ కార్యాలయం ఎదుట ప్రత్యక్షం కావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు... దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని నిశితంగా పరిశీలించిన టీడీపీ నేతలకు అక్కడ అవినాశ్‌ అనుచరులూ కనిపించారు. విజయవాడ నగరపాలక సంస్థ 18వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన వైసీపీ నేత... అరవ వెంకట సత్యనారాయణ అలియాస్‌ అరవ సత్యం స్వయంగా ఈ దాడిలో పాల్గొన్నారు. 


ఈయన అవినాశ్‌కు సన్నిహిత అనుచరుడు. నగరపాలక సంస్థలో వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి కూడా ఈయనకే కట్టబెట్టారు. అవినాశ్‌కు బాగా సన్నిహితులైన జోగ రాజు, బచ్చు మాధవి తదితరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఇందులో జోగరాజు  ఇటీవలే గాంధీ కోఆపరేటివ్‌ బ్యాంకు డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. బచ్చు మాధవి గుణదలకు చెందిన వైసీపీ కార్యకర్త. అవినాశ్‌కు సన్నిహితురాలు. అరవ సత్యం వెంట తిరిగే కొమ్మిర రమేశ్‌ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఇక... కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో పానీపూరీ బండి నడిపే ఎస్‌కే సైదా, సెల్‌ఫోన్లు రిపేరు చేసే ఎస్కే బాబు తదితరులు కూడా టీడీపీ  కార్యాలయంపై దాడి చేశారు. వీరంతా అరవ సత్యం అనుచరగణమే. అరవ సత్యంపై గతంలో రౌడీ షీట్‌ కూడా నమోదైంది. 


అన్ని వేళ్లూ అవినాశ్‌ వైపే..

మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి జరిగిన తర్వాత దేవినేని అవినాశ్‌ అనుచరగణంపైనే టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. పట్టాభి ఇంటికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం... దాడి విజయవాడ వైసీపీ నాయకుల పనే అని వ్యాఖ్యానించారు. వీటికి బలం చేకూర్చేలా సీసీ ఫుటేజీ సాక్ష్యాలు లభించాయి. విజయవాడలోని కృష్ణలంక, యనమలకుదురు, రాణిగారితోట, గుణదల, మొగల్రాజపురం తదితర ప్రాంతాల నుంచి దేవినేని అవినాశ్‌ అనుచరగణం ఈ దాడుల్లో పాలుపంచుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వైసీపీ పెద్దల ఆదేశాల మేరకే ఈ దాడులకు వ్యూహరచన జరిగినట్లు సమాచారం. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దాడి సమయంలో దేవినేని అవినాశ్‌ తన కారులో ఘటనాస్థలి వద్దే ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి... ఫ్లోర్‌ లీడర్‌ హోదాలో అరవ సత్యం మంగళవారం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ... ‘అనివార్య కారణాలవల్ల’ ఇది రద్దు చేస్తున్నట్లు 3 గంటల సమయంలో మరో సందేశం పంపించారు. దాడిలో పాల్గొనేందుకే మీడియా సమావేశం రద్దు చేసుకున్నట్లు ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు... వీళ్లంతా సొంతంగా ఒక కెమెరామ్యాన్‌ను తెచ్చుకోవడం విశేషం. కెమెరామ్యాన్‌ కూడా వీరితోపాటే వాహనంలో నుంచి కిందికి దిగాడు. టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సాగిస్తున్న దృశ్యాలను ఎంచక్కా చిత్రీకరించాడు.

Updated Date - 2021-10-21T09:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising