డ్వాక్రా సభ్యుల పెన్షన్ చట్టానికి సవరణ
ABN, First Publish Date - 2021-10-21T11:05:22+05:30
డ్వాక్రా గ్రూపు సభ్యుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఏపీ స్వయం సహాయక బృందాల సభ్యుల కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
బాధ్యతలు ఎల్‌ఐసీ నుంచి సెర్ప్‌కు మారుస్తూ ఆర్డినెన్స్
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా గ్రూపు సభ్యుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఏపీ స్వయం సహాయక బృందాల సభ్యుల కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. డ్వాక్రా సభ్యులు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తే వారికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం పింఛను అందిస్తుంది. 2009లో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఎల్‌ఐసీని నోడల్ ఏజెన్సీగా నియమించారు. తాజాగా ఈ బాధ్యతలను ఎల్‌ఐసీ నుంచి సెర్ప్‌కు మారుస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.
Updated Date - 2021-10-21T11:05:22+05:30 IST