ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ నేతలు కూడా సహకారం అందించారు’

ABN, First Publish Date - 2021-11-21T01:01:05+05:30

మహాపాదయాత్ర దిగ్విజయంగా నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిందని అమరావతి జేఏసీ నేతలు సంతోషాన్ని వెల్లడిపరిచారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ అధిగమించి ముందుకు సాగుతున్నామని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: మహాపాదయాత్ర దిగ్విజయంగా నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిందని అమరావతి జేఏసీ నేతలు సంతోషాన్ని వెల్లడిపరిచారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ అధిగమించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 220 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిందని, ఈ దృతరాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్పందన చూసైనా మేల్కోవాలని సూచించారు. నరేంద్ర మోదీ రైతులకు ఇబ్బందిగా మారిన చట్టాలను రద్దుచేస్తామని ప్రకటించారని చెప్పారు. 40 మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. మంత్రులకు వారి శాఖలు కూడా సరిగ్గా తెలియదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని రైతులు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకునే వరకూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. వైసీపీ నేతలు కూడా తమకు సహకారాన్ని అందించారని, ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను తెలుసుకోవాలన్నారు. 

Updated Date - 2021-11-21T01:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising