ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం రోజుల్లో నివాసాల కేటాయింపు చేయాలి.. లేకపోతే..

ABN, First Publish Date - 2021-06-21T20:52:34+05:30

గత ప్రభుత్వం కట్టించిన టిడ్కో నివాసాలను అమరావతి అబ్దిదారులు, దళితులు పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గత ప్రభుత్వం కట్టించిన టిడ్కో నివాసాలను అమరావతి అబ్దిదారులు, దళితులు పరిశీలించారు. వారం రోజుల్లో ప్రభుత్వం లబ్దిదారులకు టిడ్కో నివాసాలు కేటాయించకపోతే తామే ఇళ్లల్లో పాలుపొంగించి సొంతం చేసుకుంటామని హెచ్చరించారు. రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కేటాయించకుండా పాడుపెడుతోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి కేటాయించిన నివాసాల వద్దకు పత్రాలు తీసుకువచ్చి నిరసన తెలిపారు. గత ప్రభుత్వం నిరుపేదలకు అమరావతిలోని ఎన్టీఆర్ నగర్ పేరుతో ఇళ్లను కేటాయించింది. అయితే ఆ ఇళ్లను కేటాయించడానికి ససేమిరా అన్న వైసీపీ ప్రభుత్వం.. పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాంతంలో ఉన్నవారికి మాత్రం అదే ఇంటికి మరో సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు  లబ్దిదారులకు గృహాలను కేటాయించకపోవడంతో పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న టిడ్కో గృహాలను తమకు కేటాయించాలని అనేకసార్లు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. 

Updated Date - 2021-06-21T20:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising