ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిపై విష ప్రచారం: జేఏసీ కన్వీనర్

ABN, First Publish Date - 2021-02-28T17:58:08+05:30

ఏపీ రాజధానిగా అమరాతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 439 రోజులుగా రైతులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ రాజధానిగా అమరాతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 439 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే.. అమరావతిపై విష ప్రచారం జరుగుతోందని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న అమరావతిలో భూకంపం అని ప్రభుత్వ పెద్దలు విష ప్రచారం చేశారన్నారు. క్వారీలో బ్లాస్ట్‌లు జరిగి పెద్ద శబ్దాలు వస్తే భూకంపం అని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొన్నటి వరకు అమరావతి మునిగిపోతుందని అన్నారని, ఇప్పుడు భూకంపం అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇక్కడ భూమికి పటిష్టత లేదని చెప్పే ప్రయత్నంలో భాగమే నిన్న భూకంపం అని ప్రచారం చేశారని జేఏసీ కన్వీనర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-28T17:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising