ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వం చర్యలు: రాయపాటి సాయికృష్ణ

ABN, First Publish Date - 2021-10-29T19:19:05+05:30

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేలా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేలా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని అమరావతి పరిరక్షణ యువజన జాక్ అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 682 రోజులకు చేరిందన్నారు. రాష్ట్రంలో ఎదో ఒక వైఫల్యం జరిగితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమరావతిలో అలజడి సృష్టించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో యువత, విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైందన్నారు. అమరావతి ఉద్యమంలో యువత ముందుకు రావాలని, చురుగ్గా పాల్గొనాలని పిలుపిచ్చారు.


యువత భవిష్యత్ కోసం రైతులు భూములు ఇచ్చారని సాయి కృష్ణ అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడితే వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వమని డీజీపీ చెపుతున్నారని, పోలీస్ శాఖ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము న్యాయదేవతను నమ్ముకున్నామని, తమకు న్యాయం తప్పకుండా జరుగుతుందని సాయి కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-29T19:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising