ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూల్చివేతలతో పాలన మొదలు

ABN, First Publish Date - 2021-04-16T10:29:51+05:30

‘అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వేయడం లేదు కానీ కూల్చివేతలకు మాత్రం పది అడుగులు ముందుకొస్తున్నారు’ అంటూ పాలకుల తీరుపై రాజధాని రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధి దిశగా అడుగు వేయని ప్రభుత్వం

485వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు ధ్వజం

 

తుళ్లూరు, ఏప్రిల్‌ 15: ‘అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వేయడం లేదు కానీ కూల్చివేతలకు మాత్రం పది అడుగులు ముందుకొస్తున్నారు’ అంటూ పాలకుల తీరుపై రాజధాని రైతులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని వారు చేస్తున్న ఉద్యమం గురువారంతో 485వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా  రైతులు మాట్లడుతూ ప్రజావేదిక కూల్చివేతతో సీఎం జగన్‌ పాలన మొదలైందన్నారు. అప్పటినుంచి ఇప్పటి వరకు అమరావతి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని తెలిసినా, కావాలని పనులను ఆపేశారని మండిపడ్డారు.


మూడు రాజధానులు కడతామంటూ కోతలు కోస్తున్నారని, రైతులు ఇచ్చిన భూముల్లో ఒక్కటి కట్టలేని వాళ్లు మూడింటిని ఎలా నిర్మాణం చేస్తారని రైతులు ప్రశ్నించారు. రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. ఎవరైనా అన్యాయాలు, అక్రమాలు చేస్తామంటే దేవుడు సాగనివ్వడని తుళ్లూరు శిబిరంలో ఫాదర్‌ జోసఫ్‌ దేవుని వాక్యం వినిపించారు.

Updated Date - 2021-04-16T10:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising