‘34కు తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాం’
ABN, First Publish Date - 2021-12-16T02:17:20+05:30
ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిశాయి. 6 గంటలు పైగా చర్చలు కొనసాగాయి. నిన్న సజ్జల వద్ద జరిగిన సమావేశంకు కొనసాగింపుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అమరావతి: ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిశాయి. 6 గంటలు పైగా చర్చలు కొనసాగాయి. నిన్న సజ్జల వద్ద జరిగిన సమావేశంకు కొనసాగింపుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... అధికారుల కమిటీ 17 అంశాల్లో పీఆర్సీపై అభిప్రాయం చెప్పిందన్నారు. ‘‘వాటిపై మమ్మల్ని ప్రశ్నించారు. 34 కు తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాము. హెచ్‌ఆర్‌ఏ తగ్గించవద్దని కోరాము. పీఆర్సీ కమిషన్ హెచ్‌ఆర్‌ఏ రికామెండ్ చేసింది అమలు చెయ్యమన్నాం. హెచ్ఓడీ, సెక్రటేరియట్‌లో హెచ్‌ఆర్‌ఏ 30 శాతం ఉండాలికొత్తగా జాయిన్ అయిన వారికి దీన్ని అమలు చేయాలి అని కోరాము’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-12-16T02:17:20+05:30 IST