ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం: ఆలపాటి

ABN, First Publish Date - 2021-01-17T18:49:32+05:30

డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్ నసీర్ ఆధ్వర్యంలో రేపు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్వేది, విజయవాడ, రామతీర్థం, నరసరావుపేట ఘటనలపై డీజీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన దాడులలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మతసామరస్యాన్ని కాపాడాల్సిన పోలీసులే వాటిని  రెచ్చకొడుతున్నారన్నారు. నిఘా పరికరాలు, ఏర్పాటు చేశామని చెప్పిన పోలీసులు ఇప్పుడు పాలకులకు అనుగుణంగా మాట్లాడటం దారుణమన్నారు. మత మార్పిడులు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఏం చేశారో ఆధారాలు చూపాలన్నారు. అంతర్వేది విషయంలో మంత్రులు మాట్లాడిన మాటలు డీజీపికి  వినపడలేదా అని నిలదీశారు. హైదరాబాద్‌లో వైఎస్ చేసిన మతఘర్షణలు లాగానే ఆయన కుమారుడు జగన్ కూడా మత ఘర్షణలు లెవనెత్తి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆలపాటి రాజా మండిపడ్డారు. 

Updated Date - 2021-01-17T18:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising