ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందు నన్ను లేపాలి: పోలీసులకు అఖిలప్రియ హెచ్చరిక

ABN, First Publish Date - 2021-07-21T03:19:06+05:30

ఆళ్ళగడ్డ మార్కెట్లో వ్యాపారస్థులను లేపాలంటే "ముందు నన్ను లేపాలని" పోలీసులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్ళగడ్డ‌: ఆళ్ళగడ్డ మార్కెట్లో వ్యాపారస్థులను లేపాలంటే "ముందు నన్ను లేపాలని" పోలీసులను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ పర్యటించారు. సంత మార్కెట్‌లో అద్దెలు పెంచటంపై అఖిలప్రియ మండిపడ్డారు. ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ రూములను, సంత మార్కెట్‌ను అఖిలప్రియ సందర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆళ్లగడ్డ పట్టణంలో 65 శాతం బాడుగలను పెంచడం సిగ్గుచేటన్నారు. మార్కెట్లో వ్యాపారస్థులను లేపాలంటే ముందు తనను లేపాలని పోలీసులను అఖిలప్రియ హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వైయస్సార్ కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.


జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 33శాతం బాడుగ పెంపుదలకు ఆళ్లగడ్డలో స్థానిక వైసీపీ నాయకులు 100% వసూలు చేయడం సిగ్గు చేటని ఆమె మండిపడ్డారు. దీన్ని పరిపాలన అంటారో రౌడీయిజం అంటారో ప్రజలే చెప్పాలన్నారు.  మున్సిపాలిటీ మీద భారం పెరుగుతుందని ప్రజల మీద భారం పెంచడం బాధాకరమైన విషయన్నారు. చేతనైతే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మున్సిపాలిటీకి నిధులు తీసుకురావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. 

Updated Date - 2021-07-21T03:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising