ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై కోవిడ్, కర్ఫ్యూ ప్రభావం పడొద్దు : కన్నబాబు

ABN, First Publish Date - 2021-05-07T00:59:05+05:30

కోవిడ్ పరిస్థితులు, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, వినియోగదారులపై ఎలాంటి ప్రభావాలూ పడకుండా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కోవిడ్ పరిస్థితులు, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, వినియోగదారులపై ఎలాంటి ప్రభావాలూ పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి కన్నబాబు ప్రకటించారు. రాయితీపై విత్తనాలు పంపిణీ కార్యక్రమం, రబీ 2020-21తో పాటు తదితర అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి నష్టం రాకూడదని సీఎం జగన్ తమను ఆదేశించారని, ఆ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే విత్తన సరఫరాకు కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని, నిత్యావసరాల రవాణాకు తగిన అనుమతులు కల్పించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం వరకూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కోవిడ్ వల్ల రైతు పండించిన పంటలకు ధరలు పడిపోకుండా చూసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Updated Date - 2021-05-07T00:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising