ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణకు ‘సలహాదారు’ అడ్డు

ABN, First Publish Date - 2021-10-29T09:19:42+05:30

విచారణకు ‘సలహాదారు’ అడ్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆప్కోలో వెయ్యి కోట్ల అవినీతి

సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలి: డీఎల్‌


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 28: ‘‘ఆప్కోలో జరిగిన రూ.1,000 కోట్ల అవినీతిని వెలికితీసే విషయంలో సీఐడీ విచారణకు ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఆప్కో అవినీతి బాగోతంపై సీఎంకు ఎలాంటి సంబంధం లేదని, సీఎం సలహాదారుల్లో ఒకరు సీఐడీ విచారణను ఇక్కడితో వదిలేయమని చెప్పారని ఓ అధికారి నాతో చెప్పారు’’ అని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేంద్రం నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంను సర్వశిక్ష అభియాన్‌ అందిస్తోంది. 2010 నుంచి ఆప్కో... సంఘాల నుంచి కొంటున్నామని చెప్పి మిల్లులో కొంటూ వచ్చింది. ఇందులో దాదాపు రూ.1,000 కోట్లు దుర్వినియోగం అయింది. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్‌ కూడా జరిగింది. దీనిపై సీఎం ఈడీతో విచారణ చేయించాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-29T09:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising