ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-12-22T19:55:17+05:30

మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలో అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని, శంకుస్థాపన బోర్డుపై ఆలయ అనువంశిక ధర్మకర్త పేరు లేకపోవడం సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమేనన్నారు. ప్రశ్నించిన అశోక్ గజపతిరాజును వైసీపీ గూండాలు తోసివేడయం దుర్మార్గమన్నారు. ఏపీలో 200లకు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, ఏ ఘటనలోనూ దోషులను పట్టుకోలేదని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-12-22T19:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising