ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ హెడ్‌లైన్స్ షోలో వైసీపీ అరాచకాలు బట్టబయలు

ABN, First Publish Date - 2021-07-20T14:43:40+05:30

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయని వారి పెన్షన్లను వేరే జిల్లాలకు బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్(ఆంధ్రజ్యోతి): ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయని వారి పెన్షన్లను వేరే జిల్లాలకు బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని ఏబీఎన్ హెడ్‌లైన్స్ షోలో శ్రీనివాస్ అనే బాధితుడు బయటపెట్టారు. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్‌లో వచ్చిన పెన్షన్ల బదిలీ వార్తపై ఏబీఎన్ హెడ్‌లైన్స్ షోలో ప్రధానంగా దృష్టి పెట్టి అధికారులతో, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయగా మారెళ్లవారిపాలెం గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రావు జరిగిన తప్పును ఒప్పుకున్నారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు తప్పును సరిదిద్దుకుంటున్నట్లు తెలిపారు.


అసలు ఏం జరిగిందంటే...

గుంటూరు(తూర్పు), జూలై19: ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని పింఛన్లను వేర్వేరు జిల్లాలకు మార్చారని బాధితులు గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. నూజెండ్ల మండలం మారెళ్లవారిపాలెంకు చెందిన సరిబోయిన చిన గాలెమ్మ, దిడ్డి నాసరమ్మ, మారాసు గాలెమ్మ, బొప్పూడి సుబ్బారావు, చల్లా యోగయ్య తమ వృద్ధాప్య, వితంతు పింఛన్లను ఇతర జిల్లాలకు మార్చారని సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీకి ఓటు వేయలేదని గ్రామంలో వలంటీర్లుగా పనిచేస్తున్న దిడ్డి శివజ్యోతి, దిడ్డి లాలయ్య తమ పెన్షన్లను తూర్పుగోదావరి, కడప, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు బదాలయించారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం పెన్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఈకెవైసీ చేయించుకోవాలని సూచించడంతో.. అందుకోసం వలంటీర్లు, సచివాలయ వెల్ఫేర్‌ అధికారిని అడిగితే మీ డేటా మావద్ద లేదని, మీ పెన్షన్‌ వేరే జిల్లాలకు ట్రాన్సఫర్‌ చేశామని.. అక్కడకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతున్నారని తెలిపారు. 70-80 సంవత్సారాల మధ్య వయస్సున్న తాము ఈ వయస్సులో పింఛన్‌ కోసం వేరే జిల్లాలకు ఎలా వెళ్లగలుగుతామని కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్‌ స్పందించి తమకు గ్రామంలోనే పింఛన్‌ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వలంటీర్లుపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-07-20T14:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising