ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABNని బీజేపీ బ్యాన్‌ చేయలేదు: సీఎం రమేశ్

ABN, First Publish Date - 2021-11-16T02:37:12+05:30

కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఏపీ పర్యటనతో బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యక్రమాలకు రాకుండా ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఏపీ పర్యటనతో బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యక్రమాలకు రాకుండా ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యనేతలను అమిత్ షా నిలదీశారు. అసలు బీజేపీ వార్తలను కవర్ చేయని సాక్షి మీడియాను బహిష్కరించకుండా పేరున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థను ఎలా బహిష్కరిస్తారని అమిత్ షా ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎవరు వార్తలు రాసినా.. సమర్ధించాల్సిందేనని షా స్పష్టం చేశారు.


అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్తావనపై ఎంపీ సీఎం రమేశ్ స్పష్టత ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో సీఎం రమేశ్ మాట్లాడుతూ ఏపీలో పార్టీ బలోపేతంపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారని చెప్పారు. అంతర్గత భేటీలో 15 మంది బీజేపీ నేతలం పాల్గొన్నామని ఆయన తెలిపారు. పొత్తుల గురించి మాట్లాడే అర్హత తమకు లేదని అమిత్‌షా స్పష్టంగా చెప్పినట్లు సీఎం రమేశ్ స్పష్టంచేశారు. 


‘‘ ప్రభుత్వ వ్యతిరేక పనులను ఎందుకు హైలెట్‌ చేయలేకపోతున్నారని అమిత్‌షా అడిగారు. ఏపీలో బీజేపీ అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయి. ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉంది. ప్రజల్లోకి వెళ్లి మరింత పోరాటం చేయాల్సిన అవసరముందని అమిత్‌షా చెప్పారు. ABNని బీజేపీ బ్యాన్‌ చేయలేదు. వ్యక్తిగతంగా ఎవరైనా చేసుంటే మాకు సంబంధం లేదు. తిరుపతిలో జరిగే రైతు పాదయాత్రలో పాల్గొంటా.’’ అని సీఎం రమేశ్ పేర్కొన్నారు. 




Updated Date - 2021-11-16T02:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising