ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ప్రాజెక్టులపై వడ్డీకి 89 కోట్లు

ABN, First Publish Date - 2021-05-05T09:05:40+05:30

రాజధాని అమరావతిలోని వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలతోపాటు జారీ చేసిన బాండ్లపై వడ్డీ చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.89.33 కోట్లు మంజూరు చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలతోపాటు జారీ చేసిన బాండ్లపై వడ్డీ చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.89.33 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తం నుంచి హౌసింగ్‌ ప్రాజెక్టులకు రుణాలిచ్చిన ‘హడ్కో’కు త్రైమాసిక వడ్డీ, అసలును, అమరావతి బాండ్ల కొనుగోలుదారులకు త్రైమాసిక వడ్డీ, 3 ప్రభుత్వ బ్యాంకుల కన్సార్షియానికి నెలవారీ వడ్డీ చెల్లించాల్సిందిగా ఏఎంఆర్డీయే (పూర్వపు ఏపీసీఆర్డీయే) మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ను ఆదేశిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. అలాగే, రాజధానిలోని భూమి లేని నిరుపేదలకు పింఛన్ల నిమిత్తం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.30 కోట్లను కూడా మంజూరు చేస్తూ శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. 


సృజన నియామక ఉత్తర్వులు..

ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జి.సృజనను జీవీఎంసీ కమిషనర్‌గా మార్చి 20 నుంచి నియమించినట్లు కూడా పురపాలక శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.  

Updated Date - 2021-05-05T09:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising