ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

ABN, First Publish Date - 2021-05-15T09:28:31+05:30

సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు ఊహించని విధంగా మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రాజుబంగారుపాలెం సమీపంలోని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చినగంజాం, మే 14: సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు ఊహించని విధంగా మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రాజుబంగారుపాలెం సమీపంలోని రొంపేరు కాలువలో శుక్రవారం చోటుచేసుకుంది. కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని మూలగానివారిపాలెంకు చెందిన మూలగాని గోపిరెడ్డి తన ముగ్గురు స్నేహితులైన రాజుబంగారుపాలెం పంచాయతీ పరిధిలోని కుక్కలవారిపాలెంకి చెందిన కొనసం దుర్గారెడ్డి(27), కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రైల్వేస్టేషన్‌ సెంటర్‌కు చెందిన కోకి కాశీరెడ్డి(24), వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలెంకి చెందిన నంగు రమణారెడ్డి(23)లతో కలిసి రొంపేరులో చేపల వేటకు వెళ్లారు. 


తమకు తెలిసిన మత్స్యకార స్నేహితుని వద్ద కండెల వల తీసుకుని వెళ్లారు. రమణారెడ్డి వల తీసుకుని కాలువలోకి దిగాడు. అయితే పెద్ద గుంత ఉండటంతో ప్రమాదవశాత్తు బురదలో మునిగిపోతూ కేకలు వేశాడు. రమణారెడ్డిని రక్షించేందుకు దుర్గారెడ్డి వెళ్లాడు. దుర్గారెడ్డి కూడా కూరుకుపోతుండటంతో, ఇద్దరిని కాపాడేందుకు కాశీరెడ్డి దూకాడు. ప్రమాదవశాత్తు ముగ్గురు గుంతలోనే పడి మృతి చెందారు. గోపిరెడ్డి కాలువ ఒడ్డునే ఉండిపోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అంకమ్మరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారులను, ఈతగాళ్ళను పిలిపించి మృతదేహాలను బయటకు తీయించారు.

Updated Date - 2021-05-15T09:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising