ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ భవనాల నిర్మాణం వ్యయం 20 కోట్లు పెంపు

ABN, First Publish Date - 2021-05-06T09:35:40+05:30

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోను ఆర్టీజీ భవనాల నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఇప్పటికే ఉన్న ఆర్టీజీ కేంద్రానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

13 జిల్లాలో ఏర్పాటు.. రాష్ట్రస్థాయిలో మరొకటి 


అమరావతి, మే 5, (ఆంధ్రజ్యోతి): రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోను ఆర్టీజీ భవనాల నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఇప్పటికే ఉన్న ఆర్టీజీ కేంద్రానికి అదనంగా మరో భవనం నిర్మిస్తారు. ఈ భవనాల నిర్మాణానికి 2018లోనే పరిపాలనా అనుమతులు ఇచ్చారు. వీటి కోసం రూ.156.09 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఆ వ్యయాన్ని రూ.176.65 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారుగా రూ.20 కోట్ల మేర వ్యయం పెంచేందుకు పాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.2.35 కోట్లు థర్డ్‌ పార్టీ టెస్టింగ్‌ ఏజన్సీకి ఇస్తుంది. మిగతా మొత్తం భవనాల నిర్మాణానికి ఖర్చు చేస్తుంది. మరోవైపు ఆర్టీజీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కెమెరాలను రూ.60 కోట్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు యథాతథంగా ఉంటాయి. 

Updated Date - 2021-05-06T09:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising