ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 లక్షలు దాటేశాయ్‌!

ABN, First Publish Date - 2021-05-06T08:19:21+05:30

రాష్ట్రంలో కరోనా కేసులు 12లక్షల మార్కుని దాటేశాయి. గత 24గంటల్లో 1,16,367 శాంపిల్స్‌ను పరీక్షించగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో కొత్తగా 22,204 కేసులు

4 జిల్లాల్లో 2 వేలకుపైగా పాజిటివ్‌లు

24 గంటల్లో 84 మంది మృత్యువాత


అమరావతి, కడప, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు 12లక్షల మార్కుని దాటేశాయి. గత 24గంటల్లో 1,16,367 శాంపిల్స్‌ను పరీక్షించగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 12,06,232కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 2,344, అనంతపురంలో 2,304, విశాఖలో 2,113, ప్రకాశంలో 2,001, కర్నూలులో 1,985, గుంటూరులో 1,972, చిత్తూరులో 1,756, పశ్చిమగోదావరిలో 1,304, విజయనగరంలో 1,202, నెల్లూరులో 1,200, కృష్ణాలో 1,138 కేసులు నమోదయ్యాయి. బుధవారం అన్ని జిల్లాల్లో కలిపి 84 మంది కరోనాతో మరణించారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో 11మంది చొప్పున, అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 9, ప్రకాశంలో 8, పశ్చిమగోదావరిలో 7, చిత్తూరు లో 6, గుంటూరు, కర్నూలు, నెల్లూరులో ఐదుగురు చొప్పున, కృష్ణాలో 4, శ్రీకాకుళంలో 3, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 8,374కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,004 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వెయ్యికిపైగా మరణాలు ఉన్న తొలి జిల్లా ఇదే. 


ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఎండీకి కరోనా

రాష్ట్రప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రభాకర్‌ కరోనా బారిన పడ్డారు. ఆయన స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరులోని ఓ పల్లె. సొంతపనిపై ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయనకు లక్షణాలు ఉండడంతో టెస్ట్‌ చేయించగా పాజిటివ్‌గా తేలింది. ఆయనకు కడప రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. 


కూర్చున్నచోటే కుప్పకూలి..

పాయకరావుపేట, మే 5: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన తురంగి నాగమణి (60) 4రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. బుధవారం ఊపిరి తీసుకోవడంలో సమస్య ఏర్పడడంతో కుటుంబ సభ్యులు పాయకరావుపేట పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ఆమెను ఆస్పత్రి ఆవరణలో కూర్చోబెట్టారు. వారు సిబ్బందిని తెచ్చేలోగా పరిస్థితి విషమించడంతో నాగమణి కూర్చున్న చోటే కన్నుమూసింది. 

Updated Date - 2021-05-06T08:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising