ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యెరియప్ప

ABN, First Publish Date - 2020-10-24T22:00:47+05:30

విజయదశమి రోజున కేరళ ప్రజలు చేసుకునే రెసిపీ ఇది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వంటకం తయారు చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయదశమి రోజున కేరళ ప్రజలు చేసుకునే రెసిపీ ఇది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వంటకం తయారు చేస్తుంటారు. 


కావలసినవి: బియ్యం - ఒకకప్పు, పెసర్లు - రెండు టీస్పూన్లు, మెంతులు - ఒక టీస్పూన్‌, కొబ్బరి తురుము - అరకప్పు, బెల్లం - అరకప్పు, యాలకులు - మూడు, రవ్వ - రెండు టీస్పూన్లు, నూనె - తగినంత.


తయారీ విధానం: ముందుగా బియ్యం, పెసర్లు, మెంతులను మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. కొబ్బరి తురుము, బెల్లం, యాలకులు వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. నీళ్లు కొద్దిగా పోయాలి. నీళ్లు ఎక్కువగా పోస్తే మిశ్రమం పలుచగా అవుతుంది.


ఈ మిశ్రమంలో కొద్దిగా రవ్వ కలిపితే యెరియప్పలు క్రిస్పీగా వస్తాయి. మిశ్రమం పలుచగా కాకుండా ఇడ్లీ పిండి మాదిరిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత ఈ మిశ్రమాన్ని గరిటెతో తీసుకుని వేయాలి. చిన్నమంటపై రెండు వైపులా గోధుమ రంగులోకి మారే  వరకువేగించాలి. బయటకు తీసిన తరువాత వెడల్పాటి మూతతో యెరియప్పలను ఒత్తాలి. ఇలా చేస్తే  వాటికి పట్టిన ఎక్కువ నూనె పోతుంది.


Updated Date - 2020-10-24T22:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising