ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొటాటో ఫింగర్‌ చిప్స్‌

ABN, First Publish Date - 2020-01-27T21:29:11+05:30

బంగాళదుంపలు - 100 గ్రా., ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - అర టీ స్పూను, ఈస్ట్‌ పొడి - 3 గ్రా., గుడ్డు - 1, పాలు - 180 గ్రా., మైదా - 300 గ్రా., ఉల్లికాడలు (గ్రీన్‌) - ఒక కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 100 గ్రా., ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - అర టీ స్పూను, ఈస్ట్‌ పొడి - 3 గ్రా., గుడ్డు - 1, పాలు - 180 గ్రా., మైదా - 300 గ్రా., ఉల్లికాడలు (గ్రీన్‌) - ఒక కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం: బంగాళదుంపల తొక్క తీసి ముక్కలుగా తరిగి ఆవిరిపై ఉడికించి గుజ్జుగా చేయాలి. అందులో ఉప్పు, మిరియాలపొడి, ఈస్ట్‌పొడి, గుడ్డు, పాలు వేసి కలపాలి.
తర్వాత కొద్దికొద్దిగా మైదా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలిపి ఒక గిన్నెలో వేసి మూతపెట్టి పక్కనుంచాలి. గంట తర్వాత అందులో ఉల్లికాడల తరుగు వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక దళసరి ప్లాస్టిక్‌ కవర్లో వేసి ముడివేయాలి. కవరు అడుగున కత్తెరతో వేలు మందం రంధ్రం చేయాలి. తర్వాత కవరును ఒత్తుతూ వేలు పొడవున మిశ్రమాన్ని నూనెలో జారవిడుస్తూ దోరగా వేగించాలి. ఇవి సాయంత్రం చిరుతిండిగా లేదా భోజనంలో సైడ్‌ డిష్‌గా బాగుంటాయి.

Updated Date - 2020-01-27T21:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising