ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనీర్‌ దమ్‌ రోల్‌

ABN, First Publish Date - 2020-11-07T20:39:28+05:30

పనీర్‌ - ఒకకేజీ, క్యాబేజీ - ఒక కేజీ, పచ్చి బఠాణీ - 100గ్రా, కారం - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, కశ్మీరీ కారం - 30గ్రా, పచ్చిమిర్చి - 50గ్రా, నూనె - 200గ్రా, ఉప్పు - రుచికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పనీర్‌ - ఒకకేజీ, క్యాబేజీ - ఒక కేజీ, పచ్చి బఠాణీ - 100గ్రా, కారం - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, కశ్మీరీ కారం - 30గ్రా, పచ్చిమిర్చి - 50గ్రా, నూనె - 200గ్రా, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌ - 100గ్రా, రవ్వ - 100గ్రా, జున్ను - 250గ్రా, నెయ్యి - 150గ్రాములు.


తయారీ విధానం: పనీర్‌ని వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, బఠాణీ వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత తరిగిన క్యాబేజీ వేయాలి. నీరు ఇగిరిపోయేంత వరకు చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు కారం, రవ్వ, కశ్మీరీ కారం వేసి మరికాసేపు వేగించుకుని దింపాలి. మిశ్రమం చల్లారిన తరువాత జున్ను వేసి కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనీర్‌ మధ్యలో పెట్టి రోల్‌ చేసి ఫ్రిజ్‌లో గంటపాటు పెట్టుకోవాలి. తరువాత బయటకు తీసి బ్రెండ్‌ క్రంబ్స్‌ అద్దుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రోల్స్‌ను అన్ని వైపులా కాల్చాలి. చివరగా ధనియాల పొడి చల్లుకుని వేడి వేడిగా వడ్డించాలి.


పనీర్‌లో...

క్యాలరీలు 293

ఫ్యాటీ 25గ్రా

ప్రొటీన్‌ 14గ్రా

కార్బోహైడ్రేట్లు 2.97గ్రా


Updated Date - 2020-11-07T20:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising