ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ ఫింగర్స్‌

ABN, First Publish Date - 2020-06-27T19:09:51+05:30

కోడిగుడ్లు - ఎనిమిది, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు, నూనె - సరిపడా, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌ - పావు కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కోడిగుడ్లు - ఎనిమిది, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు, నూనె - సరిపడా, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌ - పావు కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - అర టీస్పూన్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు


తయారీ: ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబెట్టాలి. వెడల్పాటి పాన్‌ తీసుకుని నూనె రాసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోయాలి. ఒక వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. మధ్యలో చిన్న స్టాండ్‌లాంటిది పెట్టి దానిపై కోడిగుడ్ల మిశ్రమం పోసిన పాన్‌పెట్టి మూత పెట్టాలి. నీళ్లు పోసిన పాత్రపై కూడా మూత పెట్టాలి. చిన్నమంటపై అరగంట పాటు ఉడికించాలి. తరువాత నెమ్మదిగా బయటకు తీయాలి. ఊతప్పం మాదిరిగా అయిన వెంటనే దీన్ని వేరే ప్లేట్‌లోకి మార్చుకోవాలి. కత్తితో ఫింగర్స్‌ మాదిరిగా కట్‌ చేయాలి. మరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌, తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలపాలి. మరొక ప్లేట్‌లో కోడిగుడ్లు కొట్టి వేసి చిటికెడు ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న ఫింగర్స్‌ను పిండి మిశ్రమంలో అద్దుతూ, కోడిగుడ్డు సొనలో ముంచాలి. తరువాత బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దాలి. స్టవ్‌ ఒక పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దిన ఫింగర్స్‌ వేసి వేగించాలి. అంతే... ఎగ్‌ ఫింగర్స్‌ రెడీ.

Updated Date - 2020-06-27T19:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising