ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసగుల్ల

ABN, First Publish Date - 2020-08-15T18:45:04+05:30

పాలు - నాలుగు కప్పులు, వైట్‌ వెనిగర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - ఒకటిన్నర కప్పు, వెనీలా లేదా రోజ్‌ ఎసెన్స్‌ - కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పాలు - నాలుగు కప్పులు, వైట్‌ వెనిగర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - ఒకటిన్నర కప్పు, వెనీలా లేదా రోజ్‌ ఎసెన్స్‌ - కొన్ని చుక్కలు, గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా, నీళ్లు - మూడు కప్పులు.


తయారీ: స్టవ్‌పై మందపాటి పాన్‌ పెట్టి పాలు మరిగించాలి. తరువాత అందులో వెనిగర్‌ వేయాలి. వెనిగర్‌ చుక్కలు వేయగానే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు పలుచటి వస్త్రంతో వడబోసి నీళ్లను తీసేయాలి. వెనిగర్‌ పుల్లటి రుచి పోవడం కోసం నీళ్లు పోయాలి. కాసేపటికి మళ్లీ వస్త్రంతో నీళ్లను పిండేసి చెన్నాను పక్కన పెట్టుకోవాలి. చెన్నాను మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగానికి ఆరెంజ్‌ కలర్‌, మరో భాగానికి గ్రీన్‌ కలర్‌ కలపాలి. ఒక భాగాన్ని ఏ రంగూ కలపకుండా పెట్టుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నీళ్లు, పంచదారతో పానకం తయారుచేయాలి. పానకంలో రెడీగా ఉన్న రసగుల్లలు వేయాలి. పావుగంట పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. స్టవ్‌ పై నుంచి దింపి చల్లగా అయిన తరువాత తింటే టేస్టీగా ఉంటాయి. 

Updated Date - 2020-08-15T18:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising