ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి లడ్డూ

ABN, First Publish Date - 2020-11-14T16:44:25+05:30

దీపావళి పండుగ అంటే దివ్వెల వెలుగులతో పాటు మిఠాయిలు ఉండాల్సిందే. అయితే కరోనా భయం ఉన్న ఈ సమయంలో బయట స్వీట్‌లు కొనడం ఎందుకు? ఇంట్లోనే కొబ్బరితో బర్ఫీ, లడ్డూ, కజ్జికాయలు, చిక్కీలను ట్రై చేయండి. ఈ తీపి రుచులతో దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొబ్బరితో కమ్మగా...

దీపావళి పండుగ అంటే దివ్వెల వెలుగులతో పాటు మిఠాయిలు ఉండాల్సిందే. అయితే కరోనా భయం ఉన్న ఈ సమయంలో బయట స్వీట్‌లు కొనడం ఎందుకు? ఇంట్లోనే కొబ్బరితో బర్ఫీ, లడ్డూ,  కజ్జికాయలు, చిక్కీలను ట్రై చేయండి. ఈ తీపి రుచులతో దీపావళిని  మరింత ఆనందంగా జరుపుకోండి. 


కావలసినవి: కోవా - అరకప్పు, నెయ్యి - ఒక టీస్పూన్‌, జీడిపప్పు - పది పలుకులు, బాదం - పది పలుకులు, కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు, చిక్కటి పాలు- ఒక కప్పు.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి కోవా వేసి కరిగించాలి. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో బాదం పలుకులను కూడా వేగించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొబ్బరి తురుము వేసి వేగించాలి. గోధుమరంగులోకి మారాక చిక్కటి పాలు పోయాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కరిగించిన కోవా వేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, మధ్యలో జీడిపప్పు, బాదం పలుకు పెట్టి లడ్డూలు తయారుచేసుకోవాలి. చివరగా కొబ్బరి తురుము అద్దుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-11-14T16:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising