ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చామ ఆకుల పకోడీ

ABN, First Publish Date - 2020-12-05T19:17:07+05:30

ఎప్పుడూ ఒకే రకమైన వంటలంటే బోర్‌ కొడుతుంది. రుచుల్లో వైవిధ్యం ఉంటేనే జిహ్య చాపల్యం తీరుతుంది. భిన్నమైన రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా లభించేందుకు చామ ఆకుల పకోడీ, సజ్జల కిచిడీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పుడూ ఒకే రకమైన వంటలంటే బోర్‌ కొడుతుంది. రుచుల్లో  వైవిధ్యం ఉంటేనే జిహ్య చాపల్యం తీరుతుంది. భిన్నమైన రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా లభించేందుకు చామ ఆకుల పకోడీ, సజ్జల కిచిడీ, తామర గింజల ఖీర్‌, ముల్లంగి వేపుడు టేస్ట్‌ చేయండి.   


కావలసినవి: చామ ఆకులు - నాలుగైదు, సెనగపిండి - పావుకేజీ, ఉప్పు - తగినంత, కారం - సరిపడా, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - అర టీస్పూన్‌, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - చిటికెడు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరంమసాలా, బేకింగ్‌ సోడా వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా తయారయ్యేలా కలపాలి. చామ ఆకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. తరువాత సెనగపిండి మిశ్రమంలో ముంచి తీయాలి. ఇప్పుడు ఆకులను గుండ్రంగా రోల్‌లా చుట్టి పదిహేను  నిమిషాల పాటు ఉడికించాలి. చల్లారిన తరువాత రింగ్స్‌లా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. ఇంగువ, జీలకర్ర, పసుపు వేయాలి. తరువాత కట్‌ చేసి పెట్టుకున్న రింగ్స్‌ వేసి వేగించాలి. నిమ్మరసం పిండుకుని పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


చామ ఆకులు 100గ్రాములలో...

ప్రొటీన్లు - 18 గ్రా

క్యాలరీలు - 42

కార్బోహైడ్రేట్లు - 7 గ్రా


Updated Date - 2020-12-05T19:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising