ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసిరికాయ సబ్జ

ABN, First Publish Date - 2020-11-28T21:51:00+05:30

ఈ సీజన్‌లో ఉసిరి విరివిగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరిని మించింది లేదు. ఈ సమయంలో ఉసిరితో చట్నీ, మురబ్బా, కొబ్బరిని చేర్చి కర్రీ, పులిహోర, సబ్జీ, పిల్లలు ఎంతో ఇష్టంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుచుల్లో ఉసిరి

ఈ సీజన్‌లో ఉసిరి విరివిగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరిని మించింది లేదు. ఈ సమయంలో ఉసిరితో చట్నీ, మురబ్బా, కొబ్బరిని చేర్చి కర్రీ, పులిహోర, సబ్జీ, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యాండీలు తయారుచేసుకోవచ్చు. మరి మీరూ ఈ రెసిపీలు ప్రయత్నించండి.


ఉసిరికాయలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. 


వందగ్రాముల ఉసిరికాయలో... 

విటమిన్‌ సి - 478 గ్రా.

ఫైబర్‌ - 5 గ్రా.

క్యాలరీలు - 48

ప్రొటీన్‌ - 1గ్రా.

కార్బోహైడ్రేట్లు - 10గ్రా


కావలసినవి: ఉసిరికాయలు - ఒక కప్పు(గింజలు తీసేసి, చిన్నగా కట్‌ చేసినవి), ఆవాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఆవాల నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట. 


తయారీ: ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపు వేగిన తరువాత ఉసిరికాయ ముక్కలు వేసి కలపాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి. కారం, పసుపు, సోంపు, ధనియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. తరువాత అరకప్పు నీళ్లు పోసి, బెల్లం వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపాలి. అన్నంలోకి లేదా చపాతీలోకి ఈ సబ్జీ రుచిగా ఉంటుంది.


Updated Date - 2020-11-28T21:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising