ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూత్ కాంగ్రెస్ ఆలోచన.. వలస కార్మికులకు కొండంత సాంత్వన

ABN, First Publish Date - 2020-04-01T18:08:23+05:30

వివిధ రాష్ట్రాల్లో పని చేసే వలస కార్మికుల కోసం జాతీయ యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్బీనగర్: వివిధ రాష్ట్రాల్లో పని చేసే వలస కార్మికుల కోసం జాతీయ యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ సత్ఫలితాలను ఇస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు ఈ హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తక్షణ సాయం పొందగలుగుతున్నారు. అసోం నుంచి ఎల్బీ నగర్ వచ్చిన సుమారు 41 మంది ఈ విధంగానే లబ్ధి పొందారు. హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తమగోడు వెళ్లబోసుకోగా.. అస్సాం యూత్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్‌కు సమాచారం అందింది. అక్కడి నుంచి విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పన్యాల జైపాల్ రెడ్డి.. వారిని చేరుకుని వారానికి సరిపడే నిత్యావసర సరుకులైన బియ్యం, నూనె, పప్పులు, కూరగాయలు, గుడ్లతో పాటు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో.. రోజువారి కూలీలు, నిరుపేదలు పరిస్థితి దయణీయంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు బియ్యం, నగదు వెంటనే అందేలా చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-04-01T18:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising