ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరం పంటకు 2 గంటల్లో యూరియా

ABN, First Publish Date - 2020-07-07T07:11:57+05:30

పంటలను కోతుల బెడద నుంచి రక్షించేందుకు గతంలో మంకీ గన్‌ తయారు చేసిన నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్లకు చెందిన యువరైతు పొత్కూరి మహేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్గట్ల, జూలై 6: పంటలను కోతుల బెడద నుంచి  రక్షించేందుకు గతంలో మంకీ గన్‌ తయారు చేసిన నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్లకు చెందిన  యువరైతు పొత్కూరి మహేష్‌ అదే ఉత్సాహంతో  ఇప్పుడు మరో పరికరం తయారు చేశారు.  ప్రస్తుతం వ్యవసాయ పనులన్నీ దాదాపు యంత్రాలతోనే చేస్తున్నారు.  అయినా కొన్ని పనులకు కూలీల అవసరం తప్పడం లేదు. ప్రధానంగా యూరియా వేసే సమయంలో  ఎకరానికి  తప్పనిసరిగా ఐదుగురు కూలీలు అవసరమవుతున్నారు. ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో ఈ సమస్యను అధిగమించేందుకు  మహేష్‌ మరో సరికొత్త ఆలోచన చేశారు. ఇందు కోసం  ఫెర్టిలైజర్‌ గన్‌ తయారు చేశారు. తను సాగుచేసిన ఎకరం మొక్కజొన్న పంటలో మొక్క కింది భాగంలో ఈ గన్‌తో రెండు గంటల్లో యూరియా వేయడం పూర్తి చేశారు. ఈ గన్‌ను కేవలం రూ.320తో తయారు చేసినట్లు ఆయన చెప్పారు.  అరంగుళం ఫైప్‌లు 3, అంగుళం క్లిప్పు, అంగుళం డమ్మిక్యాప్‌, ఒక బ్యాగ్‌, అరంగుళన్నర  పీవీసీ పైప్‌, ఒక సాల్వెంట్‌, ఒక రప్పను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ఈ గన్‌ అవసరమైనవారు 9490207184కు కాల్‌ చేసి తనను సంప్రదిస్తే వివరాలు చెబుతానన్నారు.

Updated Date - 2020-07-07T07:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising