ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ.. మీరు మాకు కూడా ప్రధానే: అసద్‌

ABN, First Publish Date - 2020-04-12T09:13:08+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తికి మతం రంగు పులమడం సరికాదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శనివారం జాతీయ మీడియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అఖిలపక్ష భేటీకి పిలవలేదని అసంతృప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తికి మతం రంగు పులమడం సరికాదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శనివారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడా రు. ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల్లో ఇతర మతాల పట్ల విష ప్రచారం చేయడం మామూలైపోయిందని, ఇలాం టి చర్యలకు పాల్పడేవారి వల్ల దేశ సమైక్యతకు భంగం వాటి ల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ మజ్లిస్‌ ఎంపీలను ఆహ్వానించకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మోదీ జీ మీరు మాకు కూడా ప్రధానే’ అని వ్యాఖ్యానించారు. డిల్లీలో తబ్లీగ్‌ జమాత్‌కు హాజరైన వారి కారణంగానే కరోనా వ్యాప్తి చెందిందని వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సు మారు 6 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారని, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ భౌతిక దూరం పాటించడం లేదన్నారు. వైద్యశాఖ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ  జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని కొనియాడారు. ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-04-12T09:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising