ఎల్లంపల్లి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2020-09-01T12:53:06+05:30
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. 5570 క్యూసెక్కుల నీటిని దిగువ సుందిళ్ల బ్యారేజీలోకి విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 6163 క్యూసెక్కులుగా ఉంది.
పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. 5570 క్యూసెక్కుల నీటిని దిగువ సుందిళ్ల బ్యారేజీలోకి విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 6163 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.5363 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది.
Updated Date - 2020-09-01T12:53:06+05:30 IST