ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహస్రాయుధ నారసింహా

ABN, First Publish Date - 2020-02-22T07:43:54+05:30

దేశంలోనే అద్భుతమైన రాతి కట్టడంగా, అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలోని ప్రధానాలయ కృష్ణరాతి శిల్పాలు అబ్బురపరుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి గర్భాలయ ముఖమండపం వద్ద స్వామివారి కృష్ణరాతి శిల్పం

ఆ పక్కనే ఆదిశేషుడిపై యోగానందుడు

ప్రధానాలయంలో మరెన్నో అపురూప శిల్పాలు


యాదాద్రి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అద్భుతమైన రాతి కట్టడంగా, అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలోని ప్రధానాలయ కృష్ణరాతి శిల్పాలు అబ్బురపరుస్తున్నాయి. రాజుల కాలం నాటి శిల్ప నిర్మాణ రీతులతో... అష్టభుజి ప్రాకార మండపం, సింహరూపు కళాత్మక యాలీ స్తంభాలు, దేవతామూర్తుల బొమ్మలతో సప్తగోపుర సముదాయమే కాకుండా, వైష్ణవ ధర్మ ప్రచార భక్త శిరోమణులైన ఆళ్వార్ల విగ్రహాలతో ప్రధాన మండప రాతిస్తంభాలు ఉన్నాయి. ఇవేకాకుండా ఆలయంలో అడుగిడడంతోనే నృసింహ అవతార ఘట్టాలు, ప్రహ్లాదుడి భక్తిపరాయణత్వాన్ని చాటే అపురూప శిల్పాలు ఆవిష్కృతమవుతున్నాయి.  భాగవత, పురాణ ఇతిహాసాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే శిల్పాలు భక్తులను కనువిందు చేస్తుండగా; శిల్పాల్లో ప్రధానాలయ ముఖమండపానికి దక్షిణంవైపున ఆదిశేషుడిపై యోగానంద నృసింహుడి రాతి శిల్పం, ఉత్తరం వైపు మెట్ల మార్గాన సహస్రాయుధధారిగా సుదర్శన నారసింహుడి అపురూప శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేసేవిధంగా రూపుదిద్దుకున్నాయి. 

Updated Date - 2020-02-22T07:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising