ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నీటి పాటలు రాయను: గోరేటి వెంకన్న

ABN, First Publish Date - 2020-11-16T20:39:45+05:30

సీఎం కేసీఆర్‌కు కవులు, కళాకారులంటే చాలా గౌరవమని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న చెప్పారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కవులు, కళాకారులంటే చాలా గౌరవమని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న చెప్పారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. పల్లె వెతలపై పాటలు కట్టి పాడిన తనకు వారి సమస్యలను పరిష్కరించడానికి లభించిన అవకాశంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కవులను రాజకీయాలను వేరుగా చూడలేమని, తన పాటల్లో కూడా రాజకీయం కనిపిస్తుందని వెంకన్న పేర్కొన్నారు. పరిమితులకు లోబడి ప్రజా సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు. తెలంగాణ ఆరేళ్లలో చాలా అభివృద్ధి చెందిందని, కొత్తగా ఏర్పడ్డ ఏడు రాష్ట్రాలకంటే మనం చాలా ముందున్నామని చెప్పారు. ప్రాజెక్టులతో పంటపొలాల్లోకి నీరు వస్తోందని, అలాంటప్పుడు ఇక కన్నీటి పాటలు రాయనని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అనేవారి దృష్టికోణంలోనే లోపం ఉందని తప్పుబట్టారు. కాంగ్రెస్ నేత వీహెచ్ లాటి నేతలు తిని కూడా తినలేదు అనే రకమని, అలాంటి వారికి అభివృద్ధి కనిపించదని గోరేటి వెంకన్న విమర్శించారు.


గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యులుగా ముగ్గురిని నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ఇటీవల నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరు ఈ నెల 14నే ప్రమాణం చేస్తారని భావించినా.. అమావాస్య కావడంతో వాయిదా పడినట్లు సమాచారం. అయితే సోమవారం వీరు ప్రమాణం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-11-16T20:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising