ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లయోధుని మంచి మనసు

ABN, First Publish Date - 2020-04-09T17:23:25+05:30

లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో నిరుపేదలు, వలస కార్మికులకు నిత్యవసరాలు, భోజనాలు అందుబాటులో ఉండటం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో నిరుపేదలు, వలస కార్మికులకు నిత్యవసరాలు, భోజనాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కొంతమంది మనసున్న మారాజులు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో ముందుంటున్నాయి. అత్తాపూర్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్ రాజు పహిల్వాన్ పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యాక్రమాన్ని నిర్వహిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటి వరకు 800 మందికి నిత్యవసరాలు అందించారు. అలాగే నగరంలోని నిలోఫర్ హాస్పిటల్, అత్తాపూర్, నంది ముసలయ్యగూడ, జనప్రియ అపార్ట్‌మెంట్స్, లక్ష్మీగూడ తదితర ప్రాంతాల్లో అన్న వితరణ జరిపారు. లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి తన స్నేహితులు సహకరిస్తున్నారని.. వారు అందిస్తున్న విరాళాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 



Updated Date - 2020-04-09T17:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising