ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ హోం క్వారంటైన్

ABN, First Publish Date - 2020-03-24T17:28:27+05:30

రోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ దేశం నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఓ మహిళను వైద్యాధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ దేశం నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఓ మహిళను వైద్యాధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ నెల 16వతేదీన ఫ్రాన్స్ దేశం నుంచి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో హైదరాబాద్ మహిళకు వైద్యపరీక్షలు చేసి, కరోనా వైరస్ లేదని తేల్చినా ముందు జాగ్రత్త చర్యగా ఆమెను 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో సదరు మహిళ ఈ నెల 18వతేదీన ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు ఫ్రాన్స్ నుంచి వచ్చిన మహిళకు మళ్లీ వైద్యపరీక్షలు చేసి ఆమెను రెండురోజుల పాటు దూలపల్లిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. దూలపల్లి కేంద్రంలో ఆమెను రెండు రోజులు ఉంచాక ఈ నెల 20వతేదీన మల్లాపూర్ లోని అపార్టుమెంటులో తన సొంత ఫ్లాటుకు పంపించి అక్కడ 14రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు.


వైద్యుల ఆదేశాల ప్రకారం మహిళ హోం క్వారంటైన్‌లో ఉంటూ తల్లిదండ్రులు అందిస్తున్న ఆహారం తీసుకుంటున్నారు. ఈ మహిళ సోమవారం రాత్రి అజీర్తి సమస్యతో బాధపడుతుండటంతో ఈ విషయాన్ని బాధిత మహిళ తండ్రి దూలపల్లిలోని క్వారంటైన్ కేంద్రంలోని వైద్యులకు సమాచారం అందించారు. దీంతో వైద్యాధికారులు సోమవారం రాత్రి 11.00 గంటలకు అంబులెన్సులో వచ్చి మహిళకు మందులు అందించారు.


మహిళతోపాటు ఆమె కుటుంబసభ్యులు ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా ఉండాలని తోటి అపార్టుమెంటు వాసులు కోరారు. మహిళ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల నిత్యావసర సరకులు, కూరగాయలను తాము అందజేస్తామని, క్వారంటైన్‌లో ఉండాలని అపార్టుమెంటు వాసులు కోరారు. కరోనా ప్రబలుతున్న పరిస్థితుల్లో అపార్టుమెంటు వాసులు హోంక్వారంటైన్‌లో ఉన్న మహిళ కుటుంబానికి నిత్యావసర సరకులు అందించి, అండగా నిలచి స్ఫూర్తిని చాటుకున్నారు. 

Updated Date - 2020-03-24T17:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising