ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లు కూల్చేశారని మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-10-24T09:31:02+05:30

ఎంతో కష్టపడి నిర్మించుకున్న తమ ఇంటిని రెవెన్యూ అధికారులు అన్యాయంగా కూల్చేశారని రోదిస్తూ ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొల్లారం మునిసిపల్‌ ఆఫీసు ఎదుట ఆందోళన

లంచం ఇవ్వనందుకే కూల్చేశారు: బాధితురాలు

అది ప్రభుత్వ భూమి: తహసీల్దార్‌ 


జిన్నారం, అక్టోబరు 23 : ఎంతో కష్టపడి నిర్మించుకున్న తమ ఇంటిని రెవెన్యూ అధికారులు అన్యాయంగా కూల్చేశారని రోదిస్తూ ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం కుటుంబ సభ్యులు మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మునిసిపాలిటీ పరిధిలో శుక్రవారం జరిగింది. గండిగూడెం గ్రామానికి చెందిన దంపతులు ప్రభాకర్‌, లక్ష్మి ఇటీవల ఇంటిని నిర్మించుకున్నారు. అయితే, రెవెన్యూ అధికారులు శుక్రవారం నిర్మాణాన్ని కూల్చేశారు. దీంతో ఆవేదనకు గురైన లక్ష్మి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక రెవెన్యూ ఉద్యోగి ఒకరు రూ.20 వేలు లంచమివ్వాలని వేధించారని, ఇవ్వనందుకే ఇంటిని కూల్చేశారని లక్ష్మి ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె తన ఇద్దరు పిల్లలతో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. కాగా, సర్వే నెంబరు 216లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినందునే ఈ కట్టడాన్ని కూల్చేశామని తహసీల్దార్‌ దశరథ తెలిపారు. 

Updated Date - 2020-10-24T09:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising