ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో దారుణం.. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-10-18T22:41:43+05:30

హైదరాబాద్‌లో దారుణం.. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. చందానగర్‌లోని ఓ భవనంపై నుంచి దూకి శ్రీవిద్య (27) ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. భర్త శబరీష్‌ వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య నిన్న భర్త శబరీష్‌తో గొడవపడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ఈ సంఘటనపై చందానగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. 6 నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరీష్‌తో కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్య వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-10-18T22:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising