ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 14 తర్వాత ఏం జరగబోతోంది..?

ABN, First Publish Date - 2020-04-07T15:51:38+05:30

ఏప్రిల్ 14 తర్వాత ఏం జరగబోతోంది..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏప్రిల్ 14 తర్వాత ఏం జరగబోతోంది..? అప్పటి వరకు కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. రైల్వే రిజర్వేషన్ల సంగతేంటి? దేశంలో కరోనా కేసులు మరో వారంలో కొలుక్కి రానున్నాయా? దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది.


దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ ప్రకటించే సమయానికి వందల సంఖ్యలో ఉన్న కేసులు ఒక్కసారిగా 4 వేలకుపైగా చేరాయి. మిగతా దేశాలతో పోల్చి చూస్తే కరోనా ఉధృతి భారత దేశంలో తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇదంతా లాక్ డౌన్ ప్రభావమేనని నిపుణలు అంటున్నారు. లాక్ డౌన్‌తో దేశవ్యాప్తంగా విమానాలు, రైళ్లు, బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇక మరో వారంలో లాక్ డౌన్ ముగియనుంది. అయితే లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఏప్రిల్ 14న ఏం జరగబోతోందన్న సస్పెన్స్ ప్రజల్లో నెలకొంది.


ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే 9 రోజులు కీలకంగా మారాయనే చెప్పాలి. జిల్లాల్లో కూడా సరిహద్దులను మూసివేశారు. గ్రామాల్లోకి కొత్తవారిని రానివ్వకుండా కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనా లక్షణాలు బయటపడాలంటే 14 రోజుల సమయం పడుతుంది. అయితే ఈలోపు కొత్తగా ఎవరికైనా కరోనా సోకితే ఈ నెల 10లోపు బయటపడే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ ముగిసే 14వ తేదీలోపు దేశంలో కరోనా ప్రభావం ఎంత అన్నది ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ మర్కజ్ నుంచి రాష్ట్రంలోకి మార్చి 19 వరకు వచ్చారు. వారి నుంచి ఎంత మందికి కరోనా సోకిందన్నది 10వ తేదీలోపు తేలిపోయే అవకాశం ఉంది. అందుకే 10వ తేదీ డెడ్ లైన్‌గా భావించవచ్చునని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2020-04-07T15:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising